ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam Padayatra: యాదవులకు పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ: లోకేష్

ABN, First Publish Date - 2023-04-19T10:30:54+05:30

జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh YuvaGalam Padayatar) కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఆలూరు నియోజకవర్గం వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి 75వ రోజు పాదయాత్రను లోకేష్ (TDP Leader) మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వలగొండ గ్రామస్తులు లోకేష్‌ను (Nara Lokesh) కలిసి తమ సమస్యలను విన్నవించారు. తుమ్మల వంక బ్రిడ్జి నిర్మించాలని, వలగొండ నుంచి పప్పుల దొడ్డి వరకు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరగా.. టీడీపీ ప్రభుత్వం (TDP Government) వచ్చాక వాటిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాదయాత్ర (YuvaGalam Padayatra) చేస్తున్న యువనేతను యాదవ సామాజిక వర్గీయులు కలిశారు.

ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో యాదవ సామాజికవర్గీయులు యువనేత లోకేష్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. తమకు దామాషా ప్రకారం ఎమ్మెల్యే సీట్లు, నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని కోరారు. గొర్రెల కాపరులకు 50 ఏళ్లకు పెన్షన్ అందించాలన్నారు. గొర్రెలతో పాటు, ఆవులను కూడా సబ్సిడీపై అందించి, వాటికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని కోరారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కింద యాదవ యువతీ, యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించాలన్నారు. యాదవ విద్యార్థులకు విదేశీవిద్య పథకాన్ని అమలు చేసి రూ.20 లక్షల వరకు సాయం అందించాలని విన్నవించారు. టీటీడీ (TTD) పాలకమండలిలో శాశ్వత సభ్యునిగా యాదవులను నియమించాలన్నారు. రాష్ట్రంలో ప్రతిజిల్లాలో స్థలాలు కేటాయించి, యాదవ భవనాలు నిర్మించాలని యాదవ సామాజికవర్గీయులు కోరారు.

నారా లోకేష్ స్పందిస్తూ... రాజకీయంగా యాదవులకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో కీలకమైన ఆర్థికమంత్రిగా యనమల రామకృష్ణుడు (Yanamala Ramkrishnudu), టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ (Putta Sudhakar Yadav)లను నియమించామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు. సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందజేసి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

అంతకుముందు ఆలూరు నియోజకవర్గం కైరుప్పలో యువనేతకు మహిళలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నకిలీ విత్తనాలతో నష్టపోతున్నామని లోకేష్‌కు రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని చిరు వ్యాపారులు తెలిపారు. అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-04-19T10:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising