TG Venkatesh: మోదీ ప్రభుత్వంలో భారతదేశ ప్రతిష్ట పెరిగింది
ABN, First Publish Date - 2023-09-02T18:01:35+05:30
నరేంద్ర మోదీ ప్రభుత్వం(Narendra Modi Govt)లో భారతదేశ ప్రతిష్ట పెరిగిందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్(TG Venkatesh) అన్నారు.
కర్నూలు: నరేంద్ర మోదీ ప్రభుత్వం(Narendra Modi Govt)లో భారతదేశ ప్రతిష్ట పెరిగిందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్(TG Venkatesh) అన్నారు. శనివారం నాడు ఇంటింటికీ వెళ్లి మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం శాంతియుతంగా ఉండాలంటే, నరేంద్ర మోదీనే ప్రధాని కావాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు అంటే, మోదీ ప్రతిష్ట అంటే ఏమిటో అర్థం అవుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా భారతదేశం పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది.రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ దేశీయులు దేశ బార్డర్ దాటాలంటే భారతీయ జెండాలు పట్టుకుని దాటారంటే ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట(India's reputation) ఏంటో అర్థం అవుతుంది.కరోనా సమయం నుంచి ఇప్పటివరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్న ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు 90 శాతం నిధులను కేంద్రమే ఇస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతిపెద్ద సోలార్ ప్లాంట్, డీఆర్డీఓ ప్రాజెక్టులు ఏర్పాటు అయ్యాయంటే అది కేంద్ర ప్రభుత్వ ఘనతనే అని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-02T18:01:35+05:30 IST