ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Highcourt: లోకేష్ సీఐడీ విచారణ 10కి వాయిదా

ABN, First Publish Date - 2023-10-03T15:20:11+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సీఐడీ విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్‌ ఇచ్చిన లంచ్ మోషన్ పిటీషన్‌పై ఈరోజు(మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. లోకేశ్‌ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ లోకేష్ తరపు న్యాయవాదులు చెప్పారు.

అమరావతి: బుధవారం జరగాల్సిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (TDP Leader Nara Lokesh) సీఐడీ విచారణ (CID Inquiry) ఈనెల 10కి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి (CID) హైకోర్టు (AP Highcourt) ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు.

లోకేష్‌ ఇచ్చిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఈరోజు(మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ అని లోకేష్ తరపు న్యాయవాదులు చెప్పారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని తెలిపారు. లోకేష్‌ను ఇవి అడగడం సమంజసం కాదని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, రేపే (బుధవారం) విచారణకు హాజరుకావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది పోసాని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని ఆదేశించింది. న్యాయవాదిని అనుమతించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాహ్నం గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2023-10-03T16:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising