Lokesh: బాబాయిని చంపింది ఎవరో జగన్‌రెడ్డికి తెలియదా?
ABN, First Publish Date - 2023-02-07T18:19:51+05:30
పరదాలు లేకుండా సీఎం జగన్‌రెడ్డి బయటకు రావాలని లోకేష్ డిమాండ్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి అసలు పేరు జగన్ మోసపు రెడ్డి అని, ఏపీలో యువతను సీఎం జగన్‌రెడ్డి మోసం చేశారని లోకేష్ ఆరోపించారు. జగన్ మోసం చేయని వ్యక్తులు ఏపీలో ఎవరూ లేరని, వై నాట్ 175 కాదు.. వై నాట్ స్పెషల్ స్టేటస్, వై నాట్ పోలవరం, వై నాట్ ఏపీ అభివృద్ధి అని నారా లోకేష్ సీఎం జగన్‌ను ప్రశ్నించారు.
పరదాలు లేకుండా సీఎం జగన్‌రెడ్డి బయటకు రావాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్‌రెడ్డి ఏపీని అప్పుల్లో నెంబర్ వన్ చేశారని, బాబాయిని చంపింది ఎవరో జగన్‌రెడ్డికి తెలియదా? అని లోకేష్ సూటిగా ప్రశ్నించారు. బాబాయి కేసు విచారణ రాగానే జగన్ ఢిల్లీకి పరిగెత్తుతారని, ఏపీలో కంపెనీలు నడపాలంటే జే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని, జే ట్యాక్స్ వల్ల ఏపీ నుంచి కంపెనీలన్ని వెళ్లిపోతున్నాయని విమర్శించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం పని అయిపోయిందని నారా లోకేష్ మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని... సీఎం జగన్ పతనం నెల్లూరు నుంచి మొదలైందని నారా లోకేశ్ అన్నారు. అందరినీ ఉద్ధరిస్తానంటూ ఎన్నికలకు ముందు జగన్ చెపితే అందరూ నమ్మారని... ఉద్యోగాలు ఇస్తానని, 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానంటే మురిసిపోయారని... 151 సీట్లతో జగన్ కు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేక పోయారని లోకేష్ ఎద్దేవా చేశారు.
Updated Date - 2023-02-07T18:24:03+05:30 IST