ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Botsa: రేపటి నుంచే టీచర్ల బదిలీలు

ABN, First Publish Date - 2023-05-17T18:36:34+05:30

దయచేసి ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి బొత్స అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఉపాధ్యాయ సంఘాలతో (Teachers unions) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) సమావేశం ముగిసింది. ప్రమోషన్లు, బదిలీలపై టీచర్లతో చర్చించామని మంత్రి బొత్స తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగానే బదిలీలు చేస్తామన్నారు. రేపటి నుంచే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని, 678 ఎంఈవో -2 పోస్టులకు సంబంధించి రేపే జీవో ఇస్తామని మంత్రి వెల్లడించారు.

350 గ్రేడ్-2 హెడ్ మాస్టర్లకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. 1746 పీజీ టీచర్స్ రీ డిప్లాయిమెంట్ ప్రక్రియ కూడా రేపట్నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. 9249 మంది ఎస్జీటీ టీచర్లను బదిలీ చేస్తామని, స్కూల్స్ ప్రారంభమయ్యే లోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉపాధ్యాయులను కోరుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. దయచేసి ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని, బదిలీలు పూర్తి చేసిన తర్వాతే... పదోన్నతులు ఇస్తామని చెప్పారు. అందరినీ ఒప్పించే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.

మంత్రి బొత్స సత్యనారాయణతో సమావేశం సానుకూలంగా జరిగిందని ఎస్టీయూ అధ్యక్షులు సాయి శ్రీనివాస్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్‌ల సమస్యలను పరిష్కరించాలని కోరామని, పదోన్నతులకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన అన్నారు. 2015-17లో ఉన్న జీఓలలో చిన్న మార్పులు చేసి బదిలీలు చేస్తున్నారని, పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారని సాయి శ్రీనివాస్ చెప్పారు.

ఉన్నత పాఠశాల్లో పని చేసిన వారిని సీనియర్లుగా గుర్తించాలని, 6259 పోస్టులకు పదోన్నతి, బదిలీలు చేస్తున్నారని పీఆర్టీయూ అధ్యక్షులు అన్నారు. ఖాళీగా ఉన్న 1100 ‌పోస్టులను కూడా భర్తీ చేయాలని, ఎం.ఇ.ఒ పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వాలని పీఆర్టీయూ అధ్యక్షులు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-17T18:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising