ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Roja: త్వరలో కేసీఆర్ కూడా చంద్రబాబును తరిమికొట్టబోతున్నారు..

ABN, First Publish Date - 2023-09-05T13:38:51+05:30

తిరుపతి మహతి కళాక్షేత్రంలో గురుపూజోత్సవ వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యారంగంలో అనేక మార్పులను సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

తిరుపతి: తిరుపతి మహతి కళాక్షేత్రంలో గురుపూజోత్సవ వేడుకల్లో మంత్రి రోజా (Minister Roja) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై (TDP Chief Chandrababu naidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యారంగంలో అనేక మార్పులను సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. గురువుల్లోనే కళంకితుడు నారాయణ అని.. కలెక్షన్ కింగ్ చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు రాజకీయ గురువన్నారు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో పవన్ కళ్యాణ్‌కు (Janasena Chief Pawan Kalyan) నేర్పుతున్న గురువు చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబుకు బినామీ రాజధాని అమరావతి అని మంత్రి దుయ్యబట్టారు.


ఎక్కడ తప్పు జరగకపోయినా అబద్దాలతో ప్రజలను టీడీపీ నేతలు (TDP Leader) గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకుని హైదరాబాదులో ఇల్లు కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వేల కోట్ల రూపాయల అక్రమార్చన చంద్రబాబు ఇంట్లో ఉందన్నారు. రెండు ఎకరాల చంద్రబాబు 2 వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచారని.. చంద్రబాబు అబద్ధపు మాటలను నమ్మడం లేదన్నారు. త్వరలో కేసీఆర్ కూడా చంద్రబాబును తరిమికొట్టబోతున్నారన్నారు. ఈడీ, సీబీఐలు విచారణ జరిపి చంద్రబాబు, లోకేశ్‌లను అరెస్టు చేయాలని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-05T13:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising