Bonda Uma: మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్ నైజం: బోండా ఉమా
ABN, First Publish Date - 2023-03-25T19:05:26+05:30
ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ (CM Jagan) నెరవేర్చ లేదని టీడీపీ నేత బోండా ఉమా (Bonda Uma) తప్పుబట్టారు. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఆసరా
విజయవాడ: ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ (CM Jagan) నెరవేర్చ లేదని టీడీపీ నేత బోండా ఉమా (Bonda Uma) తప్పుబట్టారు. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఆసరా ఇవాళ విడుదల చేశారని తెలిపారు. రూ.40 వేల కోట్లకు బదులుగా.. రూ.25 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఆసరా కాదు.. టోకరా ఇచ్చారని ఎద్దేవాచేశారు. ఇంట్లో పిల్లలందరికీ అమ్మఒడి అని.. ఒక్కరికే పరిమితం చేశారని విమర్శించారు. మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్ నైజమని ఉమా దుయ్యబట్టారు. కరెంట్ బిల్లులు పెంచి రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి బాదుడుతో పేదవాడి జీవితం కుదేలయ్యిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తామని, నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజలు ఎవరూ చెత్తపన్ను కట్టవద్దని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం లెక్కలన్నీ తప్పుడు లెక్కలేనని విమర్శించారు. టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం లెక్కలన్నీ తేలుస్తామని బోండా ఉమా హెచ్చిరించారు.
Updated Date - 2023-03-25T19:05:26+05:30 IST