ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Avinash Reddy: బెయిల్‌ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాశ్ రెడ్డి... ఏం నిర్ణయం రానుందో?..

ABN, First Publish Date - 2023-05-17T10:24:15+05:30

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను ఎదుర్కుంటున్న వైసీపీ నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సుప్రీం కోర్టు మెట్లెక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Case) సీబీఐ విచారణను (CBI Investigation) ఎదుర్కుంటున్న వైసీపీ నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) సుప్రీం కోర్టు (Supreme Court) మెట్లెక్కారు. బెయిల్‌ కోసం సుప్రీంను ఎంపీ ఆశ్రయించారు. హైకోర్ట్ వెకేషన్ బెంచ్ తన బెయిల్ పెటిషన్ వినేలా ఆదేశించాలని ఉన్నతన్యాయస్థానంలో అవినాశ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ (Supreme Court CJI DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం ముందు బెయిల్‌ పిటిషన్‌ను అవినాశ్ లాయర్లు ప్రస్తావించనున్నారు.

నిన్నటి సీబీఐ విచారణలో...

కాగా... వివేకా హత్య కేసులో నిన్న (మంగళవారం) ఎంపీ అవినాశ్ సీబీఐ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా... చివరి నిమిషంలో తనకు నాలుగు రోజులు సమయం ఇవ్వాలని సీబీఐని కోరారు. ఈమేరకు సీబీఐకు ఎంపీ ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. మొదట నిరాకరించిన సీబీఐ... విచారణకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది. ఆ తరువాత కొద్ది గంటలకే అవినాశ్ విజ్ఞప్తిని సీబీఐ అంగీకరించింది. ఈనెల 19న విచారణకు రావాల్సిందిగా మరోసారి ఎంపీకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ నుంచి పులివెందుల బయలుదేరిన అవినాశ్‌రెడ్డికి మార్గమధ్యంలోనే ఆయన వాట్సాప్‌కు సీబీఐ నోటీస్‌లు అందాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈనెల 19న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందే అంటూ స్పష్టం చేసింది. అలాగే విచారణకు రావాలని నోటీసు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు పులివెందులలోని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లగా... ఆయన లేకపోవడంతో తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి డ్రైవరు నాగరాజుకు సీఆర్‌పీసీ 160 నోటీసును అందించారు. సాయంత్రానికి అవినాశ్ పులివెందులకు చేరుకున్నారు.

సుప్రీం స్వీకరించనుందా?...

ఇదిలా ఉండగా.. బెయిల్ కోసం ఈరోజు అవినాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అవినాశ్ న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ను మెన్షన్ చేయనున్నారు. అయితే బెయిల్ పిటిషన్‌పై జూన్ 5వరకు విచారణను వినలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కావాలంటే వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కానీ వెకేషన్ బెంచ్‌కు వెళ్లకుండా ఎంపీ అవినాశ్ రెడ్డి నేరుగా సుప్రీం కోర్టుకు వచ్చారు. మొదటి ప్రాధాన్యతగా తనకు బెయిల్ ఇవ్వాలని... లేని పక్షంలో వెకేషన్‌ బెంచ్ అయినా తన బెయిల్ పిటిషన్‌ను వినేలా ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నారు. అయితే అవినాశ్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Updated Date - 2023-05-17T10:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising