ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Avinash Reddy : సంబంధం లేని కేసులో ఇరికించేందుకు యత్నిస్తున్నారు..

ABN, First Publish Date - 2023-04-17T12:02:27+05:30

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు కేసు ఒక కొలిక్కి వచ్చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు కేసు ఒక కొలిక్కి వచ్చేస్తోంది. నిన్నటికి నిన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి, జగన్‌ సతీమణి భారతీరెడ్డికి స్వయాన మేనమామ అయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే నేడు అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

అవినాష్ రెడ్డి పిటిషన్‌ను నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు అంటే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు అరగంట ముందు తెలంగాణ హైకోర్టు విచారణకు అనుమతించే అవకాశం ఉంది. హైకోర్టులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉండగా.. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిందని లాయర్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం అవినాష్ రెడ్డి మాత్రం.. తాను హైకోర్టు నిర్ణయం తర్వాతే సీబీఐ విచారణకు వస్తానని తేల్చి చెబుతున్నారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందన్నారు. సంబంధం లేని కేసులో తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. న్యాయం గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.

ఇక సీబీఐ అధికారులు160 కింద విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. ఈ రోజు 3 గంటలకు అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ కు పిలిచిందన్నారు. భాస్కర్ రెడ్డిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. వైఎస్ వివేకా కేసులో మిగతా పిటిషన్ల వివరాలు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ ఆదేశించార్నారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు అనుమతించిందని న్యాయవాది తెలిపారు.

Updated Date - 2023-04-17T12:02:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising