AP Highcourt: హైకోర్టులో రాఘురామ పిల్.. ‘నాట్ బిఫోర్ మి’ అన్న న్యాయమూర్తి
ABN, First Publish Date - 2023-11-08T12:28:45+05:30
రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnam Raju) వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. అయితే ఈ పిల్‌పై నాట్ బిఫోర్ మి (Not Before Me) అని ధర్మాసనంలోని న్యాయమూర్తి అన్నారు. సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు (Senior Advocate Unnam Muralidhar Rao) వేసిన పిటీషన్‌పై విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పిల్ విచారణకు వచ్చింది. పిల్‌పై విచారణ ప్రారంభమైన వెంటనే ‘‘Not Before Me’’ అని ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు (Judge Justice Raghunandan Rao) అన్నారు. దీంతో మరో ధర్మాసనం ముందు విచారణకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలపై సీబీఐ (CBI) విచారణ జరపాలని రఘురామ కృష్ణం రాజు పిల్‌లో డిమాండ్ చేశారు.
Updated Date - 2023-11-08T12:28:46+05:30 IST