ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Punganur Incident : చంద్రబాబుపై హత్యాయత్నం, కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు..

ABN, First Publish Date - 2023-08-09T09:41:23+05:30

తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. నాలుగో తేదీ అంగళ్లులో జరిగిన సంఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడుపై ఏ వన్‌గానూ.. దేవినేని ఉమాపై ఏటుగా కేసులు నమోదు చేశారు.

చిత్తూరు : తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. నాలుగో తేదీ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో జరిగిన సంఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడుపై ఏ 1గానూ.. దేవినేని ఉమాపై ఏ 2గా కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.. పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు.. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జి గంట నరహరితో పాటు మరి కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబుపై హత్యాయత్నం, కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4న మారణాయుధాలు, ఐరన్‌ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఉమాపతిరెడ్డి ఫిర్యాదు చేశారు. 307 హత్యాయత్నం, 120 B నేరపూరిత కుట్ర చట్టాలు కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-08-09T10:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising