AP Politics : తల్లి వర్ధంతికి కూడా నేతలను వెళ్లనీయరా.. భువనేశ్వరి ఆవేదన!
ABN, First Publish Date - 2023-10-18T10:20:19+05:30
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్రను (Former Minister Kollu Ravindra) పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (TDP Chief Chandrababu Wife Nara Bhuvaneshwari) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ‘‘తల్లి వర్ధంతి కార్యక్రమానికీ నేతలను వెళ్లనీయరా...ఇదెక్కడి న్యాయం? అంటూ పార్టీ నేతల నిర్భంధంపై ట్విట్టర్ వేదికగా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ‘‘తల్లి వర్ధంతి కార్యక్రమాలకు కూడా వెళ్లనీయకుండా ఒక మాజీ మంత్రిని అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? ఇదేమి చట్టం... ఇదెక్కడి న్యాయం? కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి నన్ను ఎంతో బాధించింది. వ్యవస్థల నిర్వీర్యం అని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది. కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఉన్నతాధికారులను కోరుతున్నాను’’ అని భువనేశ్వరి ట్వీట్ చేశారు.
Updated Date - 2023-10-18T10:45:57+05:30 IST