ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Arrest: కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్న చంద్రబాబు..

ABN, First Publish Date - 2023-09-10T17:33:43+05:30

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం ఏసీబీ కోర్ట్ వెల్లడించబోయే తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్ట్ ఉవ్వబోయే తీర్పు ఎలా ఉండబోతోంది?.. స్టేషన్ బెయిల్‌తోనే చంద్రబాబు బయటకొస్తారా లేక రిమాండ్‌కు తరలించాల్సి ఉంటుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం ఏసీబీ కోర్ట్ వెల్లడించబోయే తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్ట్ ఉవ్వబోయే తీర్పు ఎలా ఉండబోతోంది?.. స్టేషన్ బెయిల్‌తోనే చంద్రబాబు బయటకొస్తారా లేక రిమాండ్‌కు తరలించాల్సి ఉంటుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తీర్పు కోసం కోర్ట్ హాల్‌లో ఎదురుచూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. తీర్పు అనుకూలంగా వస్తుందని నమ్మకంతో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అక్కడే ఉన్న యువనేత నారా లోకేష్‌తోపాటు టీడీపీ నేతలు కూడా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా విశ్వాసంతో కనిపించారు. చంద్రబాబు మద్ధతుదారులతో కలిసి దిగిన ఫొటోలో థంప్స్‌అప్ చూపించి ఉత్సాహంగా కనిపించారు.


ఇదిలావుండగా మరికొద్దిసేపట్లో తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తించబోదని కోర్ట్ తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు సెక్షన్ 17Aని కూడా ఏసీబీ కోర్ట్ తిరస్కరించినట్టు సమాచారం. చివరికి చంద్రబాబుకి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు మరికొద్ది సేపట్లోనే తెరపడనుంది.

Updated Date - 2023-09-10T17:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising