ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anam Ramanarayana Reddy: అక్రమ మైనింగ్‌పై ఎమ్మెల్యే అనిల్ మాటలు వాస్తవం కాదా..?

ABN, First Publish Date - 2023-10-27T17:10:42+05:30

సైదాపురం మండలంలో వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్‌ను తరలిస్తున్నారని స్వయంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ( MLA Anil Kumar Yadav ) అనడం వాస్తవం కాదా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ( Anam Ramanarayana Reddy ) ప్రశ్నించారు.

నెల్లూరు: సైదాపురం మండలంలో వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్‌ను తరలిస్తున్నారని స్వయంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ( MLA Anil Kumar Yadav ) అనడం వాస్తవం కాదా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ( Anam Ramanarayana Reddy ) ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆనం నివాసంలో మీడియాతో మాట్లాడుతూ..‘‘వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుంది. పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్న తనను మా ఇంటి వద్ద పోలీసులు నన్ను ఆపి అరెస్ట్ అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్థానిక మంత్రికి సహకరిస్తున్నారు అనడం వాస్తవం కాదా. జగన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. మద్యం వ్యాపారంలో 30 వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పడం వాస్తవం కాదా..? సజ్జల రామకృష్ణారెడ్డి. విజయ్ సాయిరెడ్డి ఆదేశాల మేరకే సిలికా మాఫియా , మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా వంటివి జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్నాయి. 16 మాసాలు జైల్లో ఉన్న విజయ్ సాయిరెడ్డి కూడా మాకు నీతులు వల్లిస్తున్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అక్రమ సంపాదనలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.. జగన్మోహన్‌రెడ్డి ఆస్తులను కేంద్రం జప్తు చేయాలి’’ అని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Updated Date - 2023-10-27T17:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising