ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP Rebel MLA: కోటంరెడ్డి ఆఫీస్‌లో మాక్ అసెంబ్లీ... నేనేం చేశానని సస్పెండ్ చేశారన్న ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2023-03-16T12:03:51+05:30

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో మాక్ అసెంబ్లీని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నెల్లూరు: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (YCP Rebel MLA Kotam Reddy SridharReddy) కార్యాలయంలో మాక్ అసెంబ్లీ (Mock assembly)ని నిర్వహించారు. నిన్న అసెంబ్లీ సమావేశాలకు కోటంరెడ్డి ప్లకార్డు పట్టుకుని పాదయాత్రగా వెళ్లారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలంటూ ఉదయం నుంచి సభలో నిలబడే నిరసన తెలిపారు. అయితే సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కోటంరెడ్డిని స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు కోటంరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం కోటంరెడ్డి కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. స్పీకర్ చైర్ ఏర్పాటు చేసి స్పీకర్‌గా షంషుద్దీన్‌ను కూర్చోపెట్టారు. అసెంబ్లీలో తాను ఏమి చెప్పదలుచుకున్నారో... ఆ అంశాల్ని మాక్ స్పీకర్ ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు. రూరల్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలని ఎమ్మెల్యే వివరించారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ... ప్రజా సమస్యల గురుంచి మాట్లాడేందుకు అసెంబ్లీలో తనకు అయిదు నిమిషాలు టైం ఇవ్వలేదన్నారు. తనను తిట్టేందుకు అయిదు మంది మంత్రులకు 40 నిమిషాలు సమయం ఇచ్చారని మండిపడ్డారు. గాంధీగిరిలో నిరసన చేస్తే, సస్పెండ్ చేసి... మార్షల్స్‌తో బయటకి పంపించారన్నారు. పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆరోజు వరకే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారని... తానేం చేశానని అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారో ఆలోచించాలన్నారు. రాజకీయానికి అతీతంగా నియోజకవర్గ సమస్యని పరిష్కరించమని అడిగానని తెలిపారు. వంతెనల నిర్మాణం కోసం ఈనెల 30 లోపు టెండర్లు పిలవకుంటే వచ్చే నెల 6వ తేదీన పొట్టేపాలెం కలుజు వద్ద జలదీక్ష చేస్తానని ప్రకటించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీళ్ళల్లో కూర్చోనున్నట్లు తెలిపారు. ప్రజాసమస్యల కోసం ఖచ్చితంగా ప్రశ్నిస్తానని.. మాట తప్పును.. మడెమ తిప్పను అని స్పష్టం చేశారు. అయితే.. మాక్ అసెంబ్లీలో అధికార వైసీపీని జీవిత కాలం సస్పెండ్ చేస్తున్నట్లు మాక్ స్పీకర్ షంషుద్దీన్ ప్రకటించారు.

Updated Date - 2023-03-16T12:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising