Kotamreddy SridharReddy: టీడీపీలోకి కోటంరెడ్డికి ఆహ్వానం.. మరి ఎమ్మెల్యే నిర్ణయం ఏంటంటే?..
ABN, First Publish Date - 2023-06-27T10:42:32+05:30
అధికార పార్టీ వైసీపీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తమ పార్టీలోకి రావాల్సిందిగా టీడీపీ ఆహ్వానించింది. నెల్లూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లాలోని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు భేటీ అయి కోటంరెడ్డిని టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.
నెల్లూరు: అధికార పార్టీ వైసీపీకి (YCP) దూరంగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని (MLA Kotamreddy Sridhar Reddy) తమ పార్టీలోకి రావాల్సిందిగా టీడీపీ (TDP) ఆహ్వానించింది. నెల్లూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లాలోని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు భేటీ అయి కోటంరెడ్డిని టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అందుకు కోటంరెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. దీనిపై కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ పార్టీకి దూరంగా జరిగిన తనను టీడీపీ పార్టీలోకి ఆహ్వానించినందుకు తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy), అమర్నాథ్ రెడ్డి (Amarnath reddy), అబ్దుల్ అజీజ్‌కు (Abdul Aziz) కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు తనను నిర్వహించాలని టీడీపీ పార్టీ నాయకులు ఆహ్వానించడం సంతోషకరమన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సలహా సూచనలతో లోకేష్ పాదయాత్ర విజయవంతం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో విజయవంతం చేస్తామని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... వైసీపీ పార్టీ పతనం నెల్లూరు నుంచే మొదలైందన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరులకు స్వాగతం పలికామని తెలిపారు. కాకాణి మంత్రి అయ్యాక పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారన్నారు. మూడు ఎమ్మెల్సి స్థానాలను గెలిచామని అన్నారు.
మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ... నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విజయవంతంగా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. 2024లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి రావడం చాలా సంతోషమన్నారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడం చాలా సంతోషమన్నారు. జగన్ ప్రభుత్వం మీద ప్రజలందరూ చాలా విసిగిపోయి ఉన్నారని పేర్కొన్నారు.
Updated Date - 2023-06-27T12:04:14+05:30 IST