ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotamreddy వ్యవహారంపై మంత్రి కాకాణి, బాలినేని ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2023-01-31T15:48:35+05:30

సొంత పార్టీ వాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ వాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) స్పందించారు. ‘‘అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ఫోన్ ట్యాపింగ్ కరెక్టో కాదో పరిశీలన చేసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) విషయం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అపోహ అయి ఉండవచ్చు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే ప్రభుత్వానికి ముందుగా ఎందుకు చెప్పలేదు. ఏదో ఒక వంక పెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. నిన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు నా దగ్గరకి వచ్చాడు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి కావాలని గిరిధర్ రెడ్డి అడిగారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై సీఎం జగన్ (CM JAGAN)చర్యలు తీసుకుంటారు. ఏ నాయకుడైనా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.’’ అని బాలినేని హెచ్చరించారు.

మంత్రి కాకాణి...

ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారంలో మీడియా (Media)పై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఏదైనా రాయడానికి విషయ పరిజ్ఞానం ఉండాలి. రాస్తే మన నోట్లో ఊస్తారనే సిగ్గు, బిడియం ఉండాలి. అన్నీ విడిచి నగ్నంగా తయారై రాస్తున్న రాతలివి. కోటంరెడ్డి పార్టీ మారడం, రూరల్‌కి సమన్వయకర్త రావడం అనేది కేవలం మీడియా సృష్టే. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్‌లు జరగవు. ఇవన్నీ టీ కప్పులో తుఫాను వంటివి. కోటంరెడ్డి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఏదైనా మనస్సు నొచ్చుకుని ఉంటే తెలుసుకుని సమస్యని పరిష్కరిస్తాం.’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-01-31T15:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising