Somireddy: టీడీపీ- జనసేన కలిస్తే జగన్‌రెడ్డి పతనం ఖాయం
ABN, First Publish Date - 2023-09-27T22:17:32+05:30
లుగుదేశం - జనసేన కలిస్తే ప్రభంజనమేనని.. ఆ ప్రభంజనంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గాలికి కొట్టుకుపోతారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) వ్యాఖ్యానించారు.
నెల్లూరు: తెలుగుదేశం - జనసేన కలిస్తే ప్రభంజనమేనని.. ఆ ప్రభంజనంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గాలికి కొట్టుకుపోతారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన, టీడీపీ నేతలు కీలక భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అక్రమ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన వెంటనే రియల్ హీరోలా పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తెలుగుదేశం - జనసేన ధ్యేయం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఓడించడమే. ఈ రాష్ట్రాన్ని రాక్షసపాలన నుంచి కాపాడటమే.అక్టోబర్ 2 తేదీన గాంధీబొమ్మ వద్ద నుంచి టీడీపీ, జనసేన కలిసి శాంతియుత నిరసన చేపడతాం’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సాంప్రదాయ బద్ధంగా జనసేన కార్యాలయంలో జనసేన నేతలని కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించాం. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఒక అవగాహనకి వచ్చారు. అందరూ సమష్టిగా కలిసి జగన్ దుర్మార్గ పాలనని అంతమొందించే దిశగా కార్యచరణ రూపొందిస్తాం. తెలుగుదేశం - జనసేన కలయికతో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని నిలబెట్టే విధంగా పోరాటం చేస్తాం. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి మాట్లాడుతూ..
టీడీపీతో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ జనసేన పార్టీ కలిసి పనిచేస్తుంది. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పతనం అవడం ఖాయం’’ అని మనుక్రాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-09-27T22:17:32+05:30 IST