ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somireddy: ఆ ఇద్దరూ కలిసి నెల్లూరు జిల్లాని ముంచేశారు..

ABN, First Publish Date - 2023-08-13T12:26:14+05:30

నెల్లూరు: మంత్రులు అంబటి, కాకని కలసి నెల్లూరు జిల్లాను ముంచేశారని, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు అదుపు తప్పాయని టీడీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

నెల్లూరు: మంత్రులు అంబటి (Ambati), కాకని (Kakani) కలసి నెల్లూరు జిల్లా (Nellore Dist.)ను ముంచేశారని, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు అదుపు తప్పాయని టీడీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది లక్షల ఎకరాలు.. కండలేరు, సోమశిలపై ఆధారపడి వరి సేద్యం చేస్తారని, లక్ష ఎకరాలకు 35 టీఎంసీల నీటిని గల్లంతు చేశారని ఆరోపించారు. టీడీపీ (TDP) హయాంలో నీరు లేకపోయినప్పటికి, పైప్రాంతాల నుంచి నీరు తెప్పించి రైతుల అవసరాలు తీర్చామన్నారు. కాలువల పూడికలు తీయలేదని. దోపిడీలు మాత్రమే చేసుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

పంట పండించిన రైతులు రూ.3వేల కోట్లు నష్టపోతున్నారని, వ్యవసాయ శాఖ మంత్రి దోపిడీ డబ్బు లెక్కపెట్టుకుంటున్నారా? అని కాకనిని ఉద్దేశించి సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) లెక్కలు సమాచారం హక్కు కింద అడిగినా ఇవ్వడం లేదన్నారు. లస్కర్లకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని.. కలెక్టర్ సమావేశలు పెట్టి ఏం జరిగిందో తెలుసుకునే భాద్యత లేదా? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ పేరు చెప్పి ఎన్ని కోట్లు తిన్నారో లెక్కలు తేలడం లేదని, దేశంలోనే అప్పులు, ఆత్మహత్యల్లో ఏపీని రెండవ స్థానంలో నిలబెట్టారని అన్నారు. బ్రిటీష్ వాళ్లు తొవ్వించిన చెరువులు, కొండలు హరించేశారని, రైతుల గొంతు నొక్కుతుంటే సీఎం నోరుమెదపడం లేదని, అంటే ఆయన పాత్ర కూడా ఉందా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-08-13T12:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising