ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KotamReddy: నాతమ్ముడిని లాక్కోవడం... నీ తరం, నీ తండ్రి, తాతతరం కూడా కాదు..

ABN, First Publish Date - 2023-02-18T11:53:42+05:30

ప్రభుత్వ సలహాదరు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ప్రభుత్వ సలహాదరు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (YCP Rebal MLA Kotam Reddy SridharReddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... నగర వైసీపీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావుతో పాటు రఘు, జావేద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్ని అంశాలు వదిలి నెల్లూరు రూరల్‌పై సజ్జల దృష్టి పెట్టారన్నారు. అరెస్ట్‌లపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. నేను వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వెంకటేశ్వర రావు లేకపోవడంతో పోలీసులను నిలదీశానన్నారు. 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించినట్లు ఆయన చెప్పారు.

నేతలను అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. హైవేపై రాత్రి 11:30 గంటల వరకూ తిప్పారని... పిస్టల్ అటూ ఇటూ తిప్పుతూ బెదిరించాలని చూస్తే భయపడేవారెవ్వరూ లేరన్నారు. ఇలాంటివి చిన్నప్పుడు వీఆర్ హైస్కూల్‌లో చూశామంటూ యెద్దేవా చేశారు. ‘‘నన్ను మానసికంగా వేధించాలని చూస్తున్నారు. నా పేరూ కేసులో చేర్చారు. నాతో పాటు 11 మందిపై కేసు పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి... నా తమ్ముడిని మీవైపు లాగాలని‌ అనుకుంటున్నావే. నీ తరం, నీ తండ్రి, తాత తరం కూడా కాదు. నా అనుచరులు ఎవరూ భయపడరు. నా డ్రైవర్ కూడా పట్టించుకోడు. నీకు మానసిక‌ శునకానంధం, వికృతానందం మినహా, ఏ ప్రయోజనం ఉండదు. నన్ను కూడా పోలీసు జీపు‌ ఎక్కించి రాపూరు కొండల్లో, దొంతలి అడవుల్లో తిప్పండి. ఎక్కడకీ పరారై పోను. రోజువారీ కార్యక్రమాలని కొనసాగిస్తా. న్యాయ పోరాటం చేస్తాం’’ అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-02-18T11:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising