ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP MLA quota MLC elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. టీడీపీ వ్యూహాత్మక నిర్ణయం ?

ABN, First Publish Date - 2023-03-09T12:18:35+05:30

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని దించే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని దించే యోచనలో టీడీపీ (TDP) ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ హైకమాండ్‌ ముందు కొంతమంది ఎమ్మెల్యేలు.. ప్రతిపాదనలు పెట్టినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మరి అధిష్టానం అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనేది చూడాలి. అయితే ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi), చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం (Karanam Balaram), విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ (Vasupalli Ganesh), గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి ఇప్పటికే దూరమయ్యారు. వారు వైసీపీ (YCP)కి మద్దతు ప్రకటించారు.

రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections)కు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా కమిషన్‌ పేర్కొంది. మార్చి 23వ తేదీన పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ కూడా జరగనుంది. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నారా లోకేశ్‌, చల్లా భగీరథరెడ్డి (Nara Lokesh Challa Bhagirath Reddy), పోతుల సునీత, బచ్చుల అర్జు నుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది.

మరోవైపు అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, అనంతపురం, కడప, నెల్లూరు (Anantapur Kadapa Nellore), చిత్తూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో 4.. పశ్చిమగోదావరిలో రెండు స్థానాలు, శ్రీకాకు ళం, కర్నూలు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు పోటీగా అభ్యర్థులు బరిలో నిలవడంతో ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో పి.రామసుబ్బారెడ్డి(వైసీపీ) ఏక గ్రీవం అయ్యారు. అలాగే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో కుడుపూడి సూర్యనారాయణ(వైసీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - 2023-03-09T14:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising