ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Panchumurti Anuradha: సంచలనాలకు మారుపేరు పంచుమర్తి అనురాధ

ABN, First Publish Date - 2023-03-23T21:18:23+05:30

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) సంచలన విజయం నమోదు చేసిన పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) రాజకీయ ప్రస్థానం అనూహ్యంగా మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) సంచలన విజయం నమోదు చేసిన పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) రాజకీయ ప్రస్థానం అనూహ్యంగా మొదలైంది. 2000 సంవత్సరంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సీటు బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో నాటి అధికార పార్టీ టీడీపీ అక్కడ బీసీ మహిళా అభ్యర్థి కోసం అన్వేషిస్తోందని తెలియడంతో ఎలాంటి రాజకీయ అనుభవం లేని అనురాధ మేయర్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మేయర్‌ టికెట్‌ కోసం 18 మంది పోటీ పడినా విద్యాధికురాలు కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆమెకు టికెట్‌ ఖరారు చేయడం.. అనురాధ మేయర్‌గా ఎన్నిక కావడం జరిగిపోయింది. అప్పటికి ఆమె వయసు 26 సంవత్సరాలు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆమె పేరు ఇప్పటికీ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (Limca Book of Records)లో నమోదై ఉంది.

విజయవాడ (Vijayawada) మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2000 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. మేయర్‌ పదవికి డైరెక్టు ఎన్నిక కావడంతో అనురాధ మేయర్‌గా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌, సీపీఐ తరఫున ఉద్దండులైన అభ్యర్థులను ఢీకొని ఆమె 6 వేల ఓట్ల ఆధిక్యంతో మేయర్‌గా ఎన్నికయ్యారు. కానీ 50 డివిజన్లలో టీడీపీకి కేవలం 9 స్థానాలు మాత్రమే దక్కాయి. అయినా ఐదేళ్లపాటు మేయర్‌గా నెగ్గుకురాగలిగారు. రాజకీయంగా అనుభవం లేకపోవడం.. కౌన్సిల్‌లో బలం లేకపోవడంతో ఆమె మొదట్లో కాస్త తడబడినా పట్టుదలతో పొలిటికల్‌ సైన్స్‌లో ట్యూషన్‌ పెట్టించుకుని మరీ రాజకీయాల్లో పట్టు సాధించారు. అయినా కాంగ్రెస్‌, సీపీఐ కార్పొరేటర్ల నుంచి ఆమెకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యేవి. చివరికి అనురాధ వేసుకునే డ్రెస్‌ను కూడా తప్పుపట్టి ఆమెను ఇబ్బందులకు గురి చేసేవారు. కానీ పట్టుదలతో ఆమె మేయర్‌గా నగర ప్రజల మనస్సులను గెలచుకున్నారు.

Updated Date - 2023-03-24T15:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising