ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి మరింత వాయిదా

ABN, First Publish Date - 2023-06-01T17:25:55+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం (Polavaram) ప్రాజెక్టు నిర్మాణం పూర్తి మరింత వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం (Polavaram) ప్రాజెక్టు నిర్మాణం పూర్తి మరింత వాయిదా పడింది. తాజా గడువు 2025 జూన్ వరకు పొడిగించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ సమావేశం ముగిసింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి అంచనాలపై చర్చలు జరగలేదని స్పష్టమవుతోంది. తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం అవగా, అడహక్ నిధుల కింద రూ.17,414 కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) కోరింది.

ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఏడాది ముందే పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని, 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్అండ్ ఆర్ నిధులు ఇవ్వాలని కోరామని ఏపీ సర్కారు పేర్కొంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

కాగా,.. పోలవరం ప్రాజెక్టును మినీ రిజర్వాయరుకే పరిమితం చేసే దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం గరిష్ఠ స్థాయిలో 45.72 మీటర్ల కాంటూరులో కాకుండా తొలిదశ పేరిట 41.15 మీటర్ల కాంటూరులో 92 టీఎంసీల నీటి నిల్వకే ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టమవుతోంది. లైడర్‌ సర్వే ద్వారా ఫేజ్‌–1లో 41.15 మీటర్ల కాంటూరులో అదనంగా గుర్తించిన నిర్వాసిత కుటుంబాల వివరాలు, మొదటి దశలో పోలవరం పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంచనా వ్యయంపైనా సమీక్షించారు.

Updated Date - 2023-06-01T17:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising