chandrababu kuppam tour: కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. కట్టలు తెంచుకున్న టీడీపీ అధినేత ఆవేశం
ABN, First Publish Date - 2023-01-04T17:03:59+05:30
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.
కుప్పం: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయడు (Chandrababu Naidu) కుప్పం పర్యటనలో (Chandrababu Naidu tour) తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్‌షో, సభకు అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం (Chandrababu Fires) వ్యక్తం చేశారు. పోలీసుల నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎందుకు అనుమతి ఇవ్వరంటూ పోలీసులను ఆయన నిలదీశారు.
కాగా పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ కార్యకర్తల (TDP Protest) ఆందోళనకు దిగారు. ‘కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబును అడ్డుకున్న పెద్దూరుకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. కాగా ముందుస్తుగానే ఈ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది.
జగన్‌పై నారా లోకేష్ ఫైర్
సీఎం జగన్ రెడ్డి (Jagan Reddy)పై టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) ఫైర్ అయ్యారు. ‘‘రాష్ట్రం నీ జాగీరా జగన్ రెడ్డి. ఏపీలో ఏమైనా ఎమర్జెన్సీ విధించారా?. కుప్పంలో వైసీపీ పోలీసులు అప్రటిత యుద్ధం ప్రకటించారు’’ అని లోకేష్ మండిపడ్డారు. బ్రిటిష్ చట్టానికి బూజు దులిపి అర్ధరాత్రి జీవో తెచ్చారని పేర్కొన్నారు.
కాగా బుధవారం మధ్యాహ్నం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu)కు స్వాగతం పలికేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుపడిన విషయం తెలిసిందే. బాబు పర్యటనకు ఎవరూ వెళ్లకూడదని, చంద్రబాబు రోడ్‌షో, సభకు అనుమతిలేదని పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
Updated Date - 2023-01-04T17:52:20+05:30 IST