అప్పుల ఆంధ్రాగా మార్చిన జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-04-09T23:23:27+05:30 IST

వైసీపీ అధికారంలోని వచ్చిన తరువాత లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రాగా మార్చారని టీడీపీ మండలాధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు అ న్నారు.

అప్పుల ఆంధ్రాగా మార్చిన జగన్‌రెడ్డి
కంభాలదిన్నెలో ఇదేంఖర్మ నిర్వహిస్తున్న నాయకులు

పామూరు, ఏప్రిల్‌ 9 : వైసీపీ అధికారంలోని వచ్చిన తరువాత లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రాగా మార్చారని టీడీపీ మండలాధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు అ న్నారు. మం డలంలోని కంభాలదిన్నె గ్రామంలో ఆదివారం ఇదేం ఖర్మ రాష్ర్టా నికి కార్యక్రమంతోపాటు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పువ్వాడి మాట్లాడుతూ అన్ని వస్తు వులపైనా, గ్యాస్‌, పెట్రోల్‌, కరెంట్‌, ఆర్టీసీ బస్సు టికె ట్లపై అధిక ధరలు పెంచి సామాన్య ప్రజలను జగన్‌రెడ్డి ముప్పు తిప్పలు పె డుతున్నారన్నారు. నయవంచక పాలకుడు జగన్‌ను ప్రజలు సాగ నంపాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి వ్యతి రేకంగా దౌర్జ న్యం, దాడులు, అవినీతి పాలన సాగిస్తున్న వైసీపీని ప్రశ్నించే వారిపై దాడులు చేసి, అరెస్టు చేస్తున్నారన్నారని ధ్వజ మెత్తారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎం.హుస్సేన్‌ రావుయా దవ్‌, మండల క్లస్టర్‌ కోఆర్డినేటర్లు అడుసుమల్లి ప్రభా కర్‌చౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, రైతు అధ్యక్షుడు మన్నం రమణయ్య, మాల్యాద్రి, పువ్వాడి వెంకట్‌చౌదరి, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు ఏలూరు నరసింహారావు, తెలుగుమహిళ ఓరుగంటి సుబ్బమ్మ, జయమ్మ, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు చెన్నకేశ వులు పాల్గొన్నారు. అ నంతరం గ్రామంలో కిడ్నీ వ్వాధితో బాధప డుతున్న నీటి సంఘం మాజీ అధ్యక్షుడు చల్లా ఆదయ్యను పరా మర్శించారు.

Updated Date - 2023-04-09T23:23:27+05:30 IST