Ramakrishna: మోదీయే జగన్‌ను కాపాడుతున్నారు
ABN, First Publish Date - 2023-10-09T16:26:57+05:30
ప్రకాశం జిల్లా: కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని, చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి సీఎంగా ఉండటం వలన ఏపీకి అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రకాశం జిల్లా: కేంద్రం ఏపీ (AP)కి ప్రత్యేక హోదా (Special Status) ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని, చేతగాని దద్దమ్మ రాష్ట్రానికి సీఎంగా ఉండటం వలన ఏపీకి అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ప్రకాశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీయే (PM Modi) సీఎం జగన్ (CM Jagan)ను కాపాడుతున్నారని, వందల కోట్ల రూపాయలు ఏపీలో స్కాంలు జరుగుతున్నా కేంద్రం సైలెంట్‌గా ఉందని ఆరోపించారు. ఏపీలో లిక్కర్ (Liquor), ఇసుక (Sand)లో కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి (Purandeshwari) స్వయానా కేంద్రానికి ఫిర్యాదు చేశారన్నారు. ఏపీలో వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ (CBI)తో కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మళ్లీ జగన్ ఏపీకి సీఎం కావాలని స్లోగన్ తీసుకున్నారని, నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని ప్రజలు మళ్లీ జగన్ సీఎం కావాలని అనుకుంటారని రామకృష్ణ అన్నారు. రాష్ట్రం అన్నీ రంగాలలో దివాలా తీసిందని, ‘వై నాట్ 175 అని’ జగన్ అంటున్నారని.. అంటే దొంగ ఓట్లతో మళ్లీ సీఎం కావాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే అన్నీ నియోజకవర్గాలకు వైసీపీ (YCP) డబ్బు పంపిందని, ముఖ్యమంత్రి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకుండా చంద్రబాబుని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని, బీజేపీ చెప్పినట్లు ఏపీలో జగన్ పాలన నడిపిస్తున్నారని విమర్శించారు.
నారా లోకేష్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వక పోవటం దారుణమని రామకృష్ణ అన్నారు. జగన్ విశాఖ పోయినా.. ఎక్కడికి పోయినా రాష్ట్రానికి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఏపీ అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందని, జనసేన ఎన్డీయే జట్టులో టెక్నికల్‌గా మాత్రమే ఉందని.. వచ్చే ఎన్నికల్లో టీడీడీ (TDP), సీపీఐ (CPI), సీపీఎం (CPM), జనసేన (Janasena) పొత్తులతో ఎన్నికలకు వెళుతుందని రామకృష్ణ స్పష్టం చేశారు.
Updated Date - 2023-10-09T16:26:57+05:30 IST