ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama Krishnaraju : రూ.1500 కోట్ల కాంట్రాక్టుల గురించి కీలక విషయాన్ని వెల్లడించిన రఘురామ

ABN, First Publish Date - 2023-06-19T14:00:31+05:30

సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని.. ఆమె పట్టువదలని వీరవనిత లాగా ముందుకు వెళుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. సీబీఐ విచారణ జూన్ 30 లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ పొడగించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని.. ఆమె పట్టువదలని వీరవనిత లాగా ముందుకు వెళుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. సీబీఐ విచారణ జూన్ 30 లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ పొడగించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. గతంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తన బాబాయి వివేకా హత్య జరిగిన అంశం ఉదయమే తెలుసు అనే అంశాన్ని సీబీఐ కూడా చెప్పిందని రఘురామ అన్నారు.

భారతి రెడ్డి పీఏను సైతం సీబీఐ పిలిచి విచారణ జరిపిందన్నారు. గతంలో అజయ్ ఖల్లాంను సీబీఐ పిలిచిందన్నారు. డాక్టర్ సునీతకు రఘురామ అభినందనలు తెలిపారు. ఒక వ్యవస్థతో సునీత పోరాటం చేస్తోందన్నారు. సునీతదే విజయమని.. ఆమెకు రాష్ట్ర ప్రజల దీవెనలు నిండుగా ఉన్నాయన్నారు. జూలై 3 వ తేది న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు కులం చూడము.. మతం చూడమని అంటారని కానీ ఏపీఈఆర్సీగా సభ్యుడిగా మరో రెడ్డిని నియమించారన్నారు. అలాగే.. తాజాగా 1500 కోట్ల రూ పాయలు కాంట్రాక్టులు తమ ప్రభుత్వం విడుదల చేసిందని.. వాటన్నింటినీ కూడా రెడ్డిలకు చెందిన కంపెనీలకే నిధులు విడుదల చేసిందన్నారు. అందులో పీఎల్ఆర్ పెద్దిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఫణి కుమార్ రెడ్డి తదితరుల కంపెనీలు ఉన్నాయన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ సూసైడ్ చేసుకుంటున్నారన్నారు. వారికి కూడా కొన్ని నిధులు విడుదల చేస్తే బాగుంటుందని రఘురామ అన్నారు.

Updated Date - 2023-06-19T14:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising