Sajjala Ramakrishnareddy: అన్ని విషయాల్లో కేంద్రంతో మాట్లాడుతున్నాం
ABN, First Publish Date - 2023-07-08T13:46:02+05:30
రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజీ లేకుండా అన్ని విషయాల్లో కేంద్రంతో మాట్లాడుతున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజీ లేకుండా అన్ని విషయాల్లో కేంద్రంతో మాట్లాడుతున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ (CM Jagan)ఒక్కరే కేంద్రంతో బ్యాలన్స్‌గా వ్యవహరిస్తున్నారని చాలా రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయని అన్నారు. టీడీపీకి అసలు ఒక ఐడెంటిటీ స్టాండ్ ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) ఆయన దత్తుడు వాళ్లకు వాళ్లే కొన్ని ప్రకటనలు చేస్తారని విమర్శించారు. 2014లో ఏం చెప్తున్నారో ఇప్పుడు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు టీడీపీ మ్యానిఫెస్టోకు సంబంధించి ఎక్కడైనా చర్చ ఉందా అని ప్రశ్నించారు. రుణమాఫీ హామీ ఇచ్చి చంద్రబాబు ఏం చేశారని.. అసాధ్యమైన హామీలు జగన్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అధికారం కోసం జగన్ అడ్డదారులు తొక్కరని.. చెప్పింది చేస్తారనే నమ్మకం జగన్‌పై ఉందని... ఇప్పుడు ఇది నిజమైందన్నారు. చెప్పిందే చెప్పే అబద్ధం చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. ఎన్డీయేలోకి పిలవాలి అనుకుంటే వాళ్ళ ఇష్టం.. వెళ్ళాలి అనేది టీడీపీ ఇష్టమన్నారు. వెళ్లాలనే ప్రయత్నంలో టీడీపీ ఉందని తెలిపారు. ఎన్నికలు వస్తే ఏదో హడావిడి చేస్తే ప్రజలు పట్టించుకోరన్నారు. జగన్ ఏం చేస్తారనే దానిపై ఒక స్పష్టత ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
Updated Date - 2023-07-08T13:46:02+05:30 IST