ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sajjala : టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకునే తీవ్ర ఆరోపణలు

ABN, First Publish Date - 2023-02-01T13:15:49+05:30

కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటామని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాపింగ్‌లను నమ్ముకుని అని సజ్జల పేర్కొన్నారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరని.. బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా ఇంకా ఎవరినీ నియమించ లేదన్నారు. కొంత మందిని ఎలా లాక్కోవాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుసని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. అయితే మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాత్రం అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. కాల్ రికార్డింగ్ అవ్వొచ్చన్నారు.

Updated Date - 2023-02-01T13:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising