ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sajjala: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో తెలంగాణ బిడ్డింగ్‌పై సజ్జల స్పందన.. చాలా పరిమితులు ఉన్నాయంటూ..

ABN, First Publish Date - 2023-04-11T18:18:09+05:30

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (Visakha Steel Plant) కోసం సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (Visakha Steel Plant) కోసం సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో కూడా చాలాసార్లు మాట్లాడారని, జగన్‌ ప్రతిపాదనలనే ఇవాళ కేటీఆర్‌ (KTR) కూడా చెప్పారని సజ్జల అన్నారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ బిడ్డింగ్‌లో తెలంగాణ పాల్గొనబోతుందా? అని ఆయన ప్రశ్నించారు. తాము స్టీల్‌ ప్లాంట్‌ వయబులిటీ గురించే ఆలోచిస్తున్నామని, స్టీల్‌ ప్లాంట్‌ టెండర్‌లో చాలా పరిమితులు ఉన్నాయని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ తెలుగు ప్రజల సెంటిమెంట్‌ అని సజ్జల అన్నారు. సంక్షేమ పథకాలను విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని, స్టీల్‌ ప్లాంట్‌పై విపక్షాలు అసత్యప్రచారం చేస్తున్నాయని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలని తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరె్‌స్ట-ఈవోఐ)ను ఆహ్వానించిన నేపథ్యంలో.. దాని బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిశ్చయించింది. బిడ్డింగ్‌ను దక్కించుకోగలిగితే ఇటు పాలనాపరంగా.. అటు రాజకీయంగా కేంద్రంలోని బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టినట్లవుతుందని.. ప్రైవేటీకరణను అడ్డుకున్నామని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశమంతా మైలేజీ వస్తుందని బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల 27న ఈవోఐ విడుదల అయింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఈవోఐ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేదు. కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో.. ఒకట్రెండు రోజుల్లో అధికారుల బృందం ఒకటి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్లి, అధ్యయనం చేయనుంది.

Updated Date - 2023-04-11T18:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising