వైసీపీకి షాక్
ABN , First Publish Date - 2023-04-18T00:13:46+05:30 IST
ప్రభుత్వానికి ఎస్టీ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి నిరసన సెగ తగులుతోంది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మందస మండలానికి చెందిన వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. టంగారపుట్టి పంచాయితీ ఉపసర్పంచ్ సవర హడ్డి, వార్డు మెంబర్లు సవర రామన్న, భాస్కరరావు, సుశీల, మహాలక్ష్మిలు రాజీనామా ప్రకటించారు.

వైసీపీకి షాక్
పదవులకు రాజీనామా చేసిన ఎస్టీ ప్రజాప్రతినిధులు
హరిపురం, ఏప్రిల్ 17: ప్రభుత్వానికి ఎస్టీ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి నిరసన సెగ తగులుతోంది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా మందస మండలానికి చెందిన వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. టంగారపుట్టి పంచాయితీ ఉపసర్పంచ్ సవర హడ్డి, వార్డు మెంబర్లు సవర రామన్న, భాస్కరరావు, సుశీల, మహాలక్ష్మిలు రాజీనామా ప్రకటించారు. రాజీనామాను ఎంపీడీవో తిరుమలరావుకు అందజేశారు. వైసీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న సవర డొంబురు సైతం రాజీనామా చేశారు. సాబకోట పంచాయతీలో సైతం ఐదుగురు వార్డు మెంబర్లు రాజీనామా ప్రకటించారు. పంచాయతీ కార్యదర్శికి రాజీనామా పత్రాలను సమర్పించారు. దీంతో ఏజెన్సీలో కలకలం చోటుచేసుకుంది. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే మున్ముందు రాజీనామాల సంఖ్య పెరుగుతుందని గిరిజన సంఘ నాయకుడు జగన్ స్పష్టం చేశారు.