ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Case: సుప్రీంలో ఫైబర్ కేసు విచారణ వాయిదా.. దీపావళి తర్వాతే స్కిల్ కేసుపై తీర్పు

ABN, First Publish Date - 2023-11-09T12:17:21+05:30

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈకేసుపై నవంబర్ 30న విచారణ చేపడుతామని ఉన్నతన్యాయస్థానం ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో (Fiber Net Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు (Supreme Court) వాయిదా వేసింది. ఈ కేసుపై నవంబర్ 30న విచారణ చేపడుతామని ఉన్నతన్యాయస్థానం ప్రకటించింది. అలాగే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (AP Skill Development Case) దీపావళి పండుగ (Deepavali Festival) తర్వాత తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు(TDP Chief) బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (గురువారం) సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. కోర్ట్ నంబర్ 6లో ఐటమ్ నంబర్ 11గా చంద్రబాబు కేసు విచారణకు వచ్చింది. జస్టిస్ అనిరుద్ద బోస్ (Justice Aniruddha Bose), జస్టిస్ బేలా ఎం త్రివేది (Justice Bela M Trivedi) ధర్మాసనం ముందు విచారణ జరిగింది. నవంబర్ 30న ఈ కేసును విచారిస్తామని సుప్రీం తెలిపింది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. అలాగే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఇదే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. పాత అర్డర్ ప్రకారం దీపావళి సెలవుల తర్వాత తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో అక్టోబర్ 9న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఫైబర్ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు.


కాగా.. ఈనెల 11 నుంచి 19 వరకు సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు ఉంటాయి. 20న తిరిగి సుప్రీం కోర్టు పున:ప్రారంభంకానుంది. అయితే ముందుగా ఫైబర్ నెట్ కేసు విచారణను ఈనెల 23కే వాయిదా వేసిన నేపథ్యంలో.. ఆ లోపే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫైబర్ కేసును 23కు వాయిదా వేయగా.. తన కుమారుడి వివాహం కారణంగా వాయిదా వేయమని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంను కోరారు. దీంతో నవంబర్ 30కి ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పు ఎప్పుడా అని సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో దీపావళి సెలవుల తరువాత తీర్పును వెల్లడిస్తామని సుప్పీం ధర్మాసనం చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - 2023-11-09T12:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising