ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: వైసీపీ నేతలు రాష్ట్రంలో పంచ భూతాలను మింగేశారు

ABN, First Publish Date - 2023-06-16T14:46:46+05:30

రాష్ట్రంలో వైసీపీ నేతలు పంచ భూతాలను మింగేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కుప్పంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీడీపీ అధినేత మాట్లాడుతూ... ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైందని...ఇక తరిమికొట్టడమే మిగిలిందన్నారు. భయపెట్టి ఎక్కువ కాలం రాజ్యం ఏలలేరని.. ఉత్తరకొరియా నియంత కిమ్ సోదరుడే జగన్ అని అన్నారు. పులివెందులలో భయపెట్టి గెలుస్తున్నారని.. కుప్పంలో ప్రజల అభిమానంతో గెలుస్తున్నామని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: రాష్ట్రంలో వైసీపీ నేతలు (YCP Leaders) పంచ భూతాలను మింగేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కుప్పంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీడీపీ అధినేత మాట్లాడుతూ... ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైందని...ఇక తరిమికొట్టడమే మిగిలిందన్నారు. భయపెట్టి ఎక్కువ కాలం రాజ్యం ఏలలేరని.. ఉత్తరకొరియా నియంత కిమ్ సోదరుడే జగన్ అని అన్నారు. పులివెందులలో భయపెట్టి గెలుస్తున్నారని.. కుప్పంలో ప్రజల అభిమానంతో గెలుస్తున్నామని తెలిపారు. హుదూర్ తుఫాన్‌కు భయపడని విశాఖ....వైసీపీ అక్రమార్కులకు వణికిపోతోందన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే తన లక్ష్యమన్నారు. ఆదరించిన ప్రజలపై అదే తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రజల ఇళ్లపైనా ఈ రాక్షసులు పడతారని తాను ముందుగా చెపితే నమ్మలేదని.. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది కదా అని అన్నారు. విశాఖలో జరిగిన వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వైజాగ్‌లో నేటి పరిస్థితులకు ఒక ఉదాహరణ అని అన్నారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాల్సిన బాధ్యత సీనియర్ నేతగా తనకు ఉందని తెలిపారు. 4 దశాబ్దాలుగా తనను ప్రజలు ఆదరిస్తున్నారని.. రాష్ట్రాన్ని గాడిన పెట్టి వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందరిలా భయపడి తాను రాష్ట్రాన్ని వదిలేస్తే.. రాష్ట్రం పూర్తిగా నాశనం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితి వస్తే ఎక్కువ బాధపడేది తానే టీడీపీ చీఫ్ అన్నారు.

పేదలను ధనికులను చేయడం అనేది తన సంకల్పం అని వివరించారు. దానిపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో చేసిన అభివృద్దితో అక్కడ పరిస్థితులు మారలేదా...ఇదీ కూడా అలాగే సాకారం చేస్తానన్నారు. అప్పులు చేసుకుంటూ పోవడం గొప్పవిషయం కాదని.. సంపద సృష్టించి.. దాన్ని పేదలకు పంచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు ఏపీ మధ్య ఆదాయాల్లో వ్యత్యాసం రూ.40 వేల కోట్లు ఉందన్నారు. 2014 తరువాత 5 ఏళ్లలోనే ఎంతో అభివృద్ది చేశామని.. మధ్యలో ఓటమి లేకుండా తెలుగుదేశం గెలిచి ఉంటే రాష్ట్రం ఎక్కడ ఉండేదో ఊహించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యాసలో పడి పార్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనేది వాస్తవమే... దీని వల్ల కూడా నష్టం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. నిత్యం బూతులు తిట్టడం, ఎదురు దాడి చేయడమే వైసీపీ నేతలు, మంత్రులు పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-16T14:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising