ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest: మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ గృహ నిర్బంధం

ABN, First Publish Date - 2023-09-09T09:55:29+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దాంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధంలో ఉంచుతున్నారు.

స్వామిదాసును బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

స్వామిదాసు ఇంటికి చేరుకుంటున్న టీడీపీ శ్రేణులు

తిరువూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దాంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధంలో ఉంచుతున్నారు. తిరువూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, సుధారాణి దంపతులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. స్వామిదాసును బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వామిదాసు ఇంటికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. ఈ సందర్భంగా స్వామిదాసు మాట్లాడుతూ.. జగన్ లండన్‌లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేసి ఒక్కరోజైనా జైల్లో పెట్టి రాక్షస అనందం పొందాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. సైకో ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశానికి ఇది పరాకాష్ట అని అన్నారు.

ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల (G20) నేపథ్యంలో ప్రపంచం దేశాలు పైశాచిక ముఖమంత్రి జగన్ అనందన్ని గుర్తిస్తారని చురుకలు అంటించారు. చంద్రబాబుపై నేరారోపణ రుజువుకాకుండా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయటం దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు. ప్రజలలో తిరుగుతున్న చంద్రబాబును అర్ధరాత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పిన ఆయన.. బాబు షుగర్, బీపీ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈ సైకో సీఎంకి తగిన బుద్ధి చెబుతారు.

Updated Date - 2023-09-09T09:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising