ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP MLC Results: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో టీడీపీ ముందంజ

ABN, First Publish Date - 2023-03-17T17:35:07+05:30

ఉత్తరాంధ్ర పట్టభద్రుల (Uttarandhra graduates) ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ఓట్ల లెక్కింపులో 8 రౌండ్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల (Uttarandhra graduates) ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ఓట్ల లెక్కింపులో 8 రౌండ్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇన్వాలిడ్ ఓట్లు పోగా 1,89, 017 ఓట్లు పోలైన ఓట్లు గుర్తించామని అధికారులు చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పూర్తిస్థాయిలో 50 శాతం పైబడి ఎవరికీ రానందున.. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రారంభమైందని, టీడీపీ (TDP) అభ్యర్థి చిరంజీవి రావు 82958 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా.. విజయానికి కావలసినవి 94509 ఓట్లు, రెండో ప్రాధాన్యత క్రమంలో 11,551 ఓట్లు చిరంజీవిరావుకు వస్తే విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించనున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో 7 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ ముందంజలో ఉంది. టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 26,823 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీడీపీ (TDP) 81,203, వైసీపీ (YCP) 54,374, పీడీఎఫ్‌ (PDF) 33,657, బీజేపీ (BJP) 10,768 ఓట్లు పోలయ్యాయి.

ఏపీ (Andhrapradesh)లో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పట్టభద్రుల స్థానాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత కౌంటింగ్ ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌ (TDP candidate Srikanth) ముందంజలో ఉన్నారు. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కించారు. శ్రీకాంత్‌కు 25,731 ఓట్ల మెజార్టీ సాధించారు. టీడీపీకి 1,06,587, వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి (Shyamprasad Reddy)కి 80,856 ఓట్లు పోలయ్యాయి. ఎవరికీ పూర్తి మెజార్జీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కిస్తున్నారు. మొత్తం 2.70లక్షల ఓట్లు పోలయ్యాయి. ఒక్కోరౌండ్‌కు 40వేల ఓట్లను లెక్కించారు. అందులో ప్రతీరౌండ్‌లోనూ దాదాపు మూడువేల చెల్లని ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత లెక్కింపులో 51 శాతం ఆదిక్యత తప్పనిసరి. టీడీపీ, వైసీపీ (TDP YCP) అభ్యర్థులిద్దరూ 51 శాతం మెజారిటీ సాధించలేకపోయారు. దీంతో ఫలితం ఎవరికీ తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

టీడీపీ(TDP) పోటీ చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ Graduate MLC Election Counting) ప్రక్రియపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనల అమలు, అక్రమాల నివారణపై జిల్లా అధికారులకు, ఎన్నికల అధికారులకు చంద్రబాబు (TDP Chief) ఫోన్ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్‌కే మీనా (The Chief Electoral Officer of the state is MK Meena), అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ (Anantapur District Collector Nagalakshmi), ఎస్పీ ఫకీరప్ప (SP Fakirappa) లతో టీడీపీ అధినేత ఫోన్‌లో మాట్లాడారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్‌లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి... టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ (YCP) శ్రేణులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-03-17T17:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising