ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kondru Murali: వివేకా హత్యపై జగన్‌ స్పందించాలి.. హత్య జరిగిన రోజు ఫోన్లు ఎవరికి వెళ్లాయి?

ABN, First Publish Date - 2023-02-14T17:44:35+05:30

వైఎస్ వివేకాను హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని కొండ్రు మురళి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy murder Case) హత్య కేసు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీలో హత్యా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని టీడీపీ నేత కొండ్రు మురళి (TDP leader Kondru Murali) అన్నారు. వైఎస్ వివేకాను హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని కొండ్రు మురళి డిమాండ్ చేశారు. హత్య జరిగిన రోజు జగన్ (Jagan), భారతి (Bharathi) పీఏల నుంచి ఫోన్లు ఎవరికి వెళ్లాయి? అని టీడీపీ నేత కొండ్రు మురళి ప్రశ్నించారు. వివేకా హత్య ఘటనపై జగన్‌రెడ్డి స్పందించాలని టీడీపీ నేత కొండ్రు మురళి డిమాండ్ చేశారు.

అంతకు ముందు కొండ్రు మురళి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కొండ్రు మురళి రాకతో రాజాంలో అంతర్గత విభేదాలు తగ్గడంలేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళి, టీడీపీ నేత, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి వర్గాల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. చంద్రబాబు తన జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనల్లో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. కానీ రాజాం పర్యటనలో మాత్రం అభ్యర్థి ఎవరనేది తేల్చకుండా పెండింగ్ లో పెట్టారు. చంద్రబాబు పర్యటనలో ఆసాంతం రాజాం ఇన్ఛార్జి కొండ్రు మురళి ఉన్నారు. ఇది నచ్చని ప్రతిభా భారతి కార్యక్రమం మధ్య నుంచే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతంగా ముగించారు. అన్నిచోట్ల ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో బాబు ఉబ్బితబ్బిబ్బయ్యారు. బొబ్బిలి, రాజాం తదితర నియోజకవర్గాల్లో ఇంతటి స్పందనను తాను ఊహించలేదన్నారు. బాబు తన పర్యటన ముగించిన తర్వాత కూడా రాజాంలోని రెండు గ్రూపుల మధ్య విభేదాలు చల్లారలేదు. 2019 ఎన్నికల్లో కొండ్రు మురళి టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. తర్వాత అధిష్టానానికి టచ్ లో లేరు. మళ్లీ పార్టీ బలపడుతుండటంతో దూకుడుగా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-02-14T17:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising