ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchannaidu: కష్టాల్లో ఉన్న రైతులను ఎర్రిపప్పలనడం దారుణం.. ఏపీ మంత్రులపై అచ్చెన్న ఫైర్

ABN, First Publish Date - 2023-05-09T14:29:51+05:30

వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు రోధిస్తుంటే వారిని ఎర్రిపప్పలంటూ మంత్రులు దూషిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు రోధిస్తుంటే వారిని ఎర్రిపప్పలంటూ మంత్రులు దూషిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలో బోండా ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని అచ్చెన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న రైతుల్ని బూతులు తిట్టి వక్రభాష్యాలతో సమర్ధించుకోవటం జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan reddy) మంత్రులకే చెల్లిందని వ్యాఖ్యలు చేశారు. అప్పు చేసిన 13లక్షల కోట్లలో జగన్ బటన్ నొక్కింది లక్షన్నర కోట్లు మాత్రమే అని అన్నారు. మిగిలిన పదకొండున్న లక్షల కోట్లు తాడేపల్లి ప్యాలస్‌కే చేరిందని ఆరోపించారు. జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా సాయంత్రానికల్లా తాడేపల్లి ప్యాలెస్ చేరుకునేది, నొక్కేసిన డబ్బు లెక్కపెట్టుకునేందుకే అంటూ ఆయన విరుచుకుపడ్డారు.

తాడేపల్లి ప్యాలెస్ డబ్బుతో నిండిపోవటంతో ఇడుపులపాయలో సొరంగాలు తవ్వి మరీ దాచిపెడుతున్నారన్నారు. రాష్ట్ర వినాశనమే ఏకైక లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ప్రజలున్నారన్నారు. 2019లో ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. నాటి టీడీపీ ప్రభుత్వం (TDP Government) ఎక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. సానుభూతితో జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్రానికి చారిత్రక అవసరమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గెలవాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రైతులను పరామర్శించడానికి ఒక్క అధికారి కూడా వెళ్ళలేదని.. మంత్రులు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-05-09T14:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising