ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayyannapatrudu: అమిత్ షాను చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పిన అయ్యన్న

ABN, First Publish Date - 2023-06-05T15:45:54+05:30

కేంద్రమంత్రి అమిత్‌షాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవడంపై ఆ పార్టీ నేత అయన్నపాత్రుడు మాట్లాడుతూ... చంద్రబాబు అమిత్ షాను కలవడం వెనక కారణం ఏదైనా ఉండొచ్చన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్రమంత్రి అమిత్‌షాను (Union Minister Amit shah) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) కలవడంపై ఆ పార్టీ నేత అయన్నపాత్రుడు (TDP Leader Ayyanna Patrudu) మాట్లాడుతూ... చంద్రబాబు అమిత్ షాను కలవడం వెనక కారణం ఏదైనా ఉండొచ్చన్నారు. దుర్మార్గుడి పాలన పోవాలంటే అందరూ ఏకమవ్వాలని.. గతంలోనే చెప్పినట్లు తెలిపారు. సాయిరెడ్డి ఆధ్వర్యంలో భూములు దోపిడి ఎంత జరిగిందో తెలుసన్నారు. ఎన్ని దోపిడీలు జరిగినా, అక్రమాలు జరిగిన అధికారులు మాట్లాడటం లేదని మండిపడ్డారు. సిరిపురంలో సీబీసీఎంసీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్‌కు 18 వేల చదరపు అడుగుల స్థలం ఉందని.. స్థలంలో తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ఏ అధికారిని అడిగిన చిరునవ్వు నవ్వుతున్నారని.. అడిగితే పైనుంచి ఆదేశాలు అంటున్నారని తెలిపారు. దీనిపై ఆర్టీఐ చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌కు, జీవీఎంసీ కమిషనర్‌కు సమాచారం కోసం లేఖ రాసినట్లు తెలిపారు. రెవెన్యూ అనుమతులు ఎలా ఇచ్చిందని, జీవీఎంసీ ప్లాన్ అప్రూవల్ ఎలా ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

క్రిస్టియన్ ఆర్గనైజేషన్ స్థలాన్ని అపార్ట్‌మెంట్ నిర్మించడానికి ఎలా ఇచ్చారని నిలదీశారు. క్రిస్టియన్ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. హిందువులు స్థలాలు తీసుకున్నారని, రేపు ముస్లిం స్థలాలు కూడా తీసుకుంటారని అన్నారు. ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసమని అడిగారు. ప్రజలకు దీనిపైన సమాచార చట్టం ప్రకారం సమాధానం ఇవ్వాలని.. లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని.. ఆనం వెంకట నారాయణ రెడ్డిపై దాడికి యత్నించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంలు, కేంద్ర మంత్రులను అరెస్టు చేసినటువంటి సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని.. దీని వెనుక ఎవరున్నారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

Updated Date - 2023-06-05T15:45:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising