Kanna Laxminarayan: చంద్రబాబును జైలుకు పంపాలన్నది జగన్ కల
ABN, First Publish Date - 2023-09-11T16:17:58+05:30
టీడీపీ చీఫ్ చంద్రబాబును జైలుకి పంపాలన్నది జగన్ రెడ్డి కల అని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి: టీడీపీ చీఫ్ చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) జైలుకి పంపాలన్నది జగన్ రెడ్డి(CM Jagan) కల అని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ (TDP Leader Kanna Laxminarayana) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ వైసీపీ జేబు సంస్థగా పనిచేస్తోందని మండిపడ్డారు. రఘురామ కృష్ణను అరెస్ట్ చేయించి వీడియో కాల్లో అది చూసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి జగన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసుకుని తానొక్కడే సంపాదించుకుంటూ పోలీసులను పహారా పెట్టుకున్నారని మండిపడ్డారు. లండన్ నుంచి వచ్చేసరికి తన కళ్లలో ఆనందం చూడాలని జగన్ రెడ్డి ఆత్రుత అని అన్నారు. పీవీ రమేష్ వ్యాఖ్యలను కూడా వక్రీకరించారన్నారు. పోలీసల దమనకాండ బ్రిటీష్ వారి కాలంలోనూ లేదని చెప్పుకొచ్చారు. సత్తెనపల్లిలో శాంతియుతంగా బంద్ చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లిన తీరు దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌ను అన్యాయంగా దూషిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-11T16:17:58+05:30 IST