Nara Lokesh: నా తల్లిపై కేసు పెడతామన్నారు.. లోకేష్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-10-21T12:27:39+05:30
తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి, తన భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: తన తల్లి భువనేశ్వరిపై (Nara Bhuvaneshwari) కేసు పెడతామని సీఐడీ (CID)బెదిరించిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి, తన భార్య కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదు. చంద్రబాబును జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని జగన్ అనుకున్నారు. భయం అనేదే టీడీపీ బయోడేటాలో లేదు. ఇందిరాగాంధీకే భయపడలేదు.. మరుగుజ్జు జగన్‌కు భయపడతామా..? వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు ఫ్యామ్లీని ఇబ్బంది పెట్టడమే సైకో జగన్ లక్ష్యం. 2019కు ముందు నాపై కేసుల్లేవు.. ఇప్పుడు అనేక కేసులు ఉన్నాయి. రైతుల కోసం.. మహిళల కోసం.. నిరుద్యోగుల కోసం చంద్రబాబు ప్రశ్నించడమే చంద్రబాబు చేసిన నేరమా..? ఇసుక దోపిడీ.. మద్యం మాఫియా గురించి మాట్లాడడమే చంద్రబాబు చేసిన తప్పా..? ప్రజల కోసమే చంద్రబాబు అహర్నిశలు ఆలోచించారు. జగన్ సీఎం అయిన రోజు నుంచే విధ్వంసం జరుగుతోంది. నా తల్లిపై ఐటీ రియర్న్స్ చూపి.. నా తల్లి పైనా కేసు పెడతానని బెదిరించారు. నా తల్లి ఏనాడైనా బయటకొచ్చారా..? సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు నా తల్లికి తెలియదు. గవర్నర్‌ను కలవడానికి కూడా నా తల్లి వెళ్లలేదు. నా తల్లి.. బ్రహ్మాణిలు కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట. భోజనంలో విషం కలపడం.. బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏనే. స్కిల్ కేసులో ఆధారాల్లేక కార్యకర్తలిచ్చిన పార్టీ ఫండ్.. అవినీతి సొమ్ము అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ఏం జరగకూడదని అనుకున్నారో.. అదే జరిగింది. టీడీపీ-జనసేన పొత్తు కుదిరింది. టీడీపీ - జనసేన మధ్య విబేధాలు వచ్చేలా పేటీఎం బ్యాచ్ కృషి చేస్తోంది. చంద్రబాబు, పవన్ విషయంలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో మేం నోరు విప్పితే తల ఎత్తుకోలేరు. కానీ మాకు సంస్కారం అడ్డు వస్తోంది.. వ్యక్తిగత విమర్శలు వద్దని చంద్రబాబు మాకు చెప్పారు. ఇసుకను ఓ తమ్ముడికి ఇవ్వాలని భావిస్తున్నారు. రూ. 500 కోట్లతో విశాఖలో భవనం. కోట్లు.. లక్షల రూపాయలతో బాత్రూంలు నిర్మించుకునే జగన్ పేదవాడంట. లక్ష రూపాయలతో చెప్పులేసుకునే జగన్ పేదవాడా..?. నవంబర్ ఒకటి నుంచి బాబు ష్యూర్టీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ. రాజకీయంగా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను హింసిస్తున్నారు’’ అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-21T12:27:39+05:30 IST