ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Payyavual Kesav: విద్యుత్ చార్జీల పెంపు..జగన్ సర్కార్‌పై పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు

ABN, First Publish Date - 2023-06-08T14:09:16+05:30

జగన్‌మోహన్ రెడ్డి అసమర్థత, కమీషన్ల కక్కుర్తి రాష్ట్ర విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని దెబ్బతీస్తోందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan reddy) అసమర్థత, కమీషన్ల కక్కుర్తి రాష్ట్ర విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని దెబ్బతీస్తోందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ (PAC chairman Payyavula Kesav) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో ఒక్కో కుటుంబం ఎంత విద్యుత్ ఛార్జీలు చెల్లించింది.. ఈ 4 ఏళ్లనుంచి ఎంత చెల్లిస్తోందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలపై రూ.57వేలకోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడటానికి ప్రధాన కారణం జగన్ సర్కారు అవినీతి నిర్ణయాలని విమర్శించారు. కమీషన్ల కోసం బయట మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్ కొనడం, నాసిరకం బొగ్గుకొనుగోళ్లు, కేంద్రవిద్యుత్ సంస్థలనుంచి కొనుగోళ్లు నిలిపేయడం, వ్యవసాయమోటార్లు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం లాంటి కారణాలతో ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. ఇప్పటికి 7సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్.. సంక్షేమం పేరుతో ఇచ్చేదానికంటే అదనంగా విద్యుత్ ఛార్జీలపేరుతో దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

2014లో ఏపీ 22వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటులో ఉంటే... 2019 నాటికి చంద్రబాబు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారన్నారు. 4 ఏళ్లలో జగన్ ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా పెంచారా అని ప్రశ్నించారు. 8 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ అదానీ సంస్థకు కట్టబెట్టిన దానిలో అవినీతికి తెరలేపారన్నారు. హైకోర్టు జోక్యంతో ప్రజలపై రూ.లక్షకోట్ల వరకు భారం పడకుండా నిలిచిపోయిందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రజలు సమర్థిస్తున్నారు అనడం పచ్చి అబద్ధమన్నారు. జీవో-1తో ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను, ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని అధికారంతో అణచివేసే చర్యలకు ఎందుకు పాల్పడుతోందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలస్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను గౌరవించింది కాబట్టే వారు నిరసన వ్యక్తం చేయగలిగారని అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల నుంచి పెల్లుబికే నిరసన ధాటికి ప్రభుత్వం ఎక్కడుంటుందో కూడా చెప్పలేమని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-08T14:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising