Varla Ramaiah: టీడీపీ నేత నాగేశ్వరరావు కిడ్నాప్‌పై డీజీపీ, గవర్నర్‌కు వర్ల లేఖ
ABN , First Publish Date - 2023-08-31T10:20:39+05:30 IST
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గురజాలలో టీడీపీ నాయకులు కొప్పుల నాగేశ్వరావు కిడ్నాప్‌పై రాష్ట్ర డీజీపీ, గవర్నర్, హైకోర్టు రిజిస్టార్కు తెలుగుదేశం నేత వర్ల రామయ్య లేఖ రాశారు.
అమరావతి: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గురజాలలో టీడీపీ నాయకులు కొప్పుల నాగేశ్వరావు కిడ్నాప్‌పై రాష్ట్ర డీజీపీ, గవర్నర్, హైకోర్టు రిజిస్టార్కు తెలుగుదేశం నేత వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) లేఖ రాశారు. గత కొంతకాలంగా ఐటీడీపీలో నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు (గురువారం) తెల్లవారుజామున గుర్తుతెలియని కొంత మంది వ్యక్తులు కొప్పుల నాగేశ్వరావుని ఇంటి వద్ద కిడ్నాప్ చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. నాగేశ్వరావుకి ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని.. వెంటనే నాగేశ్వరావు ఆచూకీ ఎక్కడ ఉందో సంబంధిత పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు.