ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Leaders: చంద్రబాబు అరెస్టు గురించి జగన్‌కు తెలియదనడం హాస్యాస్పదం..

ABN, First Publish Date - 2023-10-10T15:06:34+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘జగన్మోహన్ రెడ్డి నీకు నీ కేసులకు భయపడతాం అనుకుంటున్నావా క్వశ్చనే లేదు. భయపడం. చివరి క్షణం వరకు పోరాడుతాం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పులను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది’’.

రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరిని (Nara Bhuvaneshwari) టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘జగన్మోహన్ రెడ్డి (CM Jagan) నీకు నీ కేసులకు భయపడతాం అనుకుంటున్నావా క్వశ్చనే లేదు. భయపడం. చివరి క్షణం వరకు పోరాడుతాం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పులను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ప్రశ్నించే గొంతును నొక్కేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా.. వంద రోజులు లెక్కపెట్టుకో జగన్మోహన్ రెడ్డి తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలే తేలుస్తారు. చంద్రబాబు అరెస్టు గురించి జగన్‌కు తెలియదనడం హాస్యాస్పదం. నిన్ను దొంగ అనాలా....? గజదొంగ అనాలా ....? ఇంకా ఏమైనా అనాలా జగన్.. ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నావు జగన్.. తెలుగు దేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి వైసీపీకి చెమటలు పడుతున్నాయి. నీ నిజాయితీ ఏంటో నీ ఆస్తులు ప్రకటించి నిరూపించుకో. పవన్ కళ్యాణ్‌తో కలిసి బలమైన ప్రభుత్వాన్ని నిర్మిస్తాం. రోజా గురించి తెలుసు కాబట్టి వైసీపీ సోదరీమణులు ఎవరు స్పందించడం లేదు’’ అంటూ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు.


ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలుచేస్తోందని మండిపడ్డారు. ఓటర్ల లిస్టులో తప్పు ఒప్పులను సరిచేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి.. జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. జగన్.. పోలీసులు లేకుండా కార్యకర్తలతో దమ్ముంటే వీధుల్లోకి రా అంటూ సవాల్ విసిరారు.

Updated Date - 2023-10-10T15:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising