ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Panchumarthi Anuradha: స్కిల్‌ని స్కాం అంటూ.. ప్రధాని పేరు, ఫోటో ఎలా పెట్టావ్ జగన్?

ABN, First Publish Date - 2023-10-04T12:12:46+05:30

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (TDP MLC Panchumarthi Anuradha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ రెడ్డీ... స్కిల్‌ని స్కామ్ అన్నావ్... ఈరోజు ఏయూలో స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రధాని పేరు, ఫోటో పెట్టావు. రాష్ట్రం మొత్తం మీద 42 సెంటర్లు లేవన్నావు... ఆ సెంటర్లకు ప్రధాని పేరు, ఫోటో పెట్టావు. పరికరాలు ఇవ్వలేదన్నావు... ప్రధాని పేరు, ఫోటో పెట్టావు. మనీ లాండరింగ్ జరిగిందన్నావు....ప్రధాని పేరు, ఫోటో పెట్టావు. ఒప్పందాల జీవోలకు పొంతన లేదన్నావు...ప్రధాని పేరు, ఫోటో పెట్టావు. బోగస్ ఇన్వాయిస్‌లు పెట్టి నిధులు దోచేశారన్నావు... ప్రధాని పేరు, ఫోటో పెట్టావు. నీ మతలబు ప్రజలకు తెలిసిపోయింది జగన్ రెడ్డీ’’ అంటూ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారు.


అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్‌కు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదన్నారు. రేపు చంద్రబాబు నిజాయితీపరులుగా వస్తున్నారని తెలుసుకుని ఈ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై ఆరోపణలు చేసిన.. పోలవరానికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలియని మంత్రి, కాపులను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడిన మంత్రి, పూజారులను కొడితే తప్పేంటన్న మంత్రి.. ఇంగ్లీషు, తెలుగు రాని మంత్రి, సన్న బియ్యం ఇవ్వకపోగా తన నియోజకవర్గంలోని కాపులను ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన మంత్రి సమాధానం చెప్పాల్సిందే.. ఈ మతలబు గుట్టు విప్పాల్సిందే’’ అని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-04T12:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising