ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IT Officials: ప్రొద్దుటూరు బంగారు షాపుల్లో ఐటీ తనిఖీలు.. 300 కేజీల గోల్డ్ సీజ్?

ABN, First Publish Date - 2023-10-21T21:33:51+05:30

ప్రొద్దుటూరు బంగారు షాపుల్లో గత 3 రోజులుగా ఐటీ అధికారుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి.

కడప: ప్రొద్దుటూరు బంగారు షాపుల్లో గత 3 రోజులుగా ఐటీ అధికారుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రముఖ జ్యూవెలరీ షాపుల్లో ఐటీ సోదాలు చేస్తోంది. బుశెట్టి జ్యూవెలరీ షాపులో భారీగా బంగారు ఆభరణాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బుశెట్టి, గురురాఘవేంద్ర, తల్లం దుకాణాల్లో 300 కేజీలకు పైగా బంగారాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. ఐటి అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేని బంగారాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. సోదాలు జరుగుతున్న జ్యూవెలర్స్ షాపుల బయట సీఆర్పీఫ్ పోలీసులు మోహరించారు. బయట నుంచి కష్టమర్లను వెళ్లకుండా సీఆర్పీఫ్ బలగాలు చూస్తున్నాయి. ఐటీ దాడులతో చాలా జ్యూవెలరీ షాపులను యజమానులు మూసివేశారు. బంగారు వ్యాపారంలో రెండవ ముంబాయిగా చెప్పుకొనే ప్రొద్దుటూరులో ఐటి అధికారులు భారీగా బంగారం సీజ్ చేయడంపై కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-10-21T21:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising