TTD Board Members : 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ప్రకటన.. ప్చ్ ఈయనకు ఎందుకిచ్చారో..!?
ABN, First Publish Date - 2023-08-25T21:25:31+05:30
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పాటైంది. కొద్దిసేపటి క్రితమే టీటీడీ అధికారికంగా జాబితాను విడుదల చేసింది..
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పాటైంది. కొద్దిసేపటి క్రితమే టీటీడీ అధికారికంగా జాబితాను విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితమే టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
24 మంది సభ్యులు వీరే..
ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట)
పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం)
తిప్పేస్వామి (మడకశిర)
మాసీమ బాబు (కడప)
యానాదయ్య (కడప)
వై. సీతారామిరెడ్డి (కర్నూలు, మంత్రాలయం)
సుబ్బరాజు (ఉంగుటూరు)
నాగ సత్యం యాదవ్ (ఏలూరు)
శిద్ధా రాఘువరావు కుమారుడు సుధీర్ (ప్రకాశం)
అశ్వథామ నాయక్ (అనంతపురం)
డాక్టర్ శంకర్ (తమిళనాడు)
కృష్ణమూర్తి (తమిళనాడు)
దేశ్‌పాండే (కర్ణాటక)
పెనక శరత్ చంద్రారెడ్డి (తెలంగాణ)
ఎంపీ రంజిత్ కుమార్ సతీమణి సీతా రంజిత్ రెడ్డి (తెలంగాణ)
అమోల్ కాలే (మహారాష్ట్ర)
సౌరభ్ బోరా (మహారాష్ట్ర)
మిలింద్ నర్వేకర్ (మహారాష్ట్ర)
కేతన్ దేశాయ్
బోర సౌరభ్
మేకా శేషుబాబు
రాంరెడ్డి సాముల
బాలుసుబ్రమణియన్ పళనిస్వామి
ఎస్ఆర్ విశ్వనాథరెడ్డి వీరితో పాటు పలువురు సభ్యులుగా నియమితులయ్యారు.
కాగా.. ఈసారి మహారాష్ట్ర నుంచి ఏకంగా ముగ్గుర్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కింది. ఈ సభ్యులంతా దేవాలయం యొక్క ఆధ్యాత్మిక పవిత్రత, ఆర్థిక పారదర్శకత.. సమర్థవంతమైన పనితీరును నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే.. సీనియర్ నేత శిద్ధా రామయ్యకు చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా రాలేదు కానీ.. ఆయన కుమారుడికి పాలకమండలిలో చోటు దక్కింది. మరోవైపు.. జంగా కృష్ణామూర్తి పేరు పెద్ద ఎత్తున ప్రచారం కాగా.. చివరికి బోర్డులో కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.
ఈయనకు ఎందుకో..?
ఇదిలా ఉంటే.. పాలకమండలిలో పెనక శరత్ చంద్రారెడ్డి పేరు ఉండటం విచిత్రంగా ఉంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యాక ఈయన బెయిల్‌పై విడుదలయ్యారు. శరత్.. ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు. ఈయనకు బోర్డు సభ్యునిగా పదవి ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. నూతన టీటీడీ బోర్డు సభ్యుల్లో చాలా మంది దేవుని సేవకు అర్హత లేనివాళ్లేనని.. దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి జాబితా ఇదిగో..
Updated Date - 2023-08-25T21:38:06+05:30 IST