Vijayasai Reddy : పార్లమెంటును స్తంభింపజేయడాన్ని వైసీపీ సమర్థించదు
ABN, First Publish Date - 2023-07-26T10:49:25+05:30
పార్లమెంట్‌ను స్తంభింపజేయడాన్ని వైఎస్సార్సీపీ సమర్ధించదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మణిపూర్ అంశం మీద హోం మంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని, సమాధానం చెబుతానని అన్నారన్నారు. మణిపూర్ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని.. ఇది పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందన్నారు.
ఢిల్లీ : పార్లమెంట్‌ను స్తంభింపజేయడాన్ని వైఎస్సార్సీపీ సమర్ధించదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మణిపూర్ అంశం మీద హోం మంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని, సమాధానం చెబుతానని అన్నారన్నారు. మణిపూర్ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని.. ఇది పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందన్నారు. ఇలాంటప్పుడు ఉభయ సభలను నిలిపివేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మణిపూర్ అంశంపై విపక్షాలు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌పై పార్లమెంటును స్తంభింపజేశాయి. నిన్న అంటే 4వ రోజు కూడా ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే మైక్‌ను చైర్మన్ కట్ చేయడంతో నిరసనగా ఇండియా కూటమి పార్టీలన్నీ వాకౌట్ చేశాయి. ఆప్ నేత సంజయ్‌సింగ్‌ను సెషన్ అంతటికీ సస్పెండ్ చేయడంపై విపక్షాలన్నీ సోమవారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి. కాగా, ప్రతిష్ఠంభనను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చొరవ చూపారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ సైతం ఇదే ప్రయత్నం చేశారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ సహా పలువురు విపక్ష సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఇవేవీ ఫలించలేదు. ఇక గందరగోళం మధ్యే రాష్ట్రాల బహుళ సహకార సంఘాల సవరణ, ఇతర బిల్లులను ఆమోదించారు.
Updated Date - 2023-07-26T10:49:25+05:30 IST