Vijayawada: దుర్గగుడిలో మరోసారి బయటపడ్డ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు
ABN , First Publish Date - 2023-07-01T13:51:14+05:30 IST
ప్రముఖ పుణ్యక్షత్రం కనకదుర్గంగుడిలో శాకాంబరీ ఉత్సవాల వేళ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు మరోసారి బయటపడ్డాయి.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షత్రం కనకదుర్గమ్మ గుడిలో శాకాంబరీ ఉత్సవాల వేళ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు మరోసారి బయటపడ్డాయి. ఈవో భ్రమరాంబ తీరుపై చైర్మన్ కర్నాటి రాంబాబు అసహనం వ్యక్తం చేశారు. దుర్గగుడి అంతర్గత బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలోనూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి ఈవో బ్రమరాంబ బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు, సిబ్బంది మార్పు జరిగింది. శాకంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో సీసీ చార్జి తీసుకోని పరిస్థితి. ఇద్దరు అటెండర్లకు గాను ఒక్క అటెండర్‌ను మాత్రమే వేయడంపై ఈవోపై చైర్మన్, పాలకమండలి సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో తీరుతో ఒక్క అటెండర్‌ను పేషీ నుంచి చైర్మన్ వెనక్కి పంపేశారు. చైర్మన్ పేషీలో దేవస్ధానం సిబ్బంది కూడా కనిపించని పరిస్థితి. శాకంబరీ ఉత్సవాల వేళ దేవస్ధానం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చైర్మన్ కర్నాటి రాంబాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి ఇరువురి మధ్యయ విబేధాలు బట్టబయలు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.