Vidadala rajini: వరల్డ్ క్లాస్ స్థాయిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం
ABN, First Publish Date - 2023-07-20T16:52:54+05:30
మెడికల్ కాలేజీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తితో నడిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరిమిత ఫీజులతో మెడికల్ కాలేజీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు మెడికల్ సీట్లు కోసం ఇతర దేశాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు ద్వారా స్థానికంగా విద్యార్థులకు మేలు జరుగుతుంది.
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించిన ఐదు మెడికల్ కాలేజీలను వరల్డ్ క్లాస్ స్థాయిలో ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) తెలిపారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘మెడికల్ కాలేజీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తితో నడిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరిమిత ఫీజులతో మెడికల్ కాలేజీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు మెడికల్ సీట్లు కోసం ఇతర దేశాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు ద్వారా స్థానికంగా విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం కలగదు. మెడికల్ కాలేజీల వల్ల ప్రభుత్వానికి.. కాలేజీ నిర్వహణకు ఆర్థిక భారం కాబోదు. జనరల్ కేటగిరీ రూ.15 వేలు, బీ కేటగిరీ రూ.12 లక్షలు, ఎన్‌ఆర్ఐ సీట్లకు రూ.20 లక్షలు చొప్పున ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. జగనన్న సురక్ష ద్వారా జరిగే మేలు ప్రజల ముఖాల్లో సంతోషం తెచ్చింది. నేను నా నియోజక వర్గం వెళ్లినప్పుడు సురక్ష కార్యక్రమం గురించి ప్రజలు గొప్ప చెప్పుకుంటున్నారు.’’ అని మంత్రి తెలిపారు.
Updated Date - 2023-07-20T16:52:54+05:30 IST