ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Minister Challenge: విస్సన్నపేట భూములపై చంద్రబాబుకు గుడివాడ అమర్నాథ్ సవాల్...

ABN, First Publish Date - 2023-05-20T12:39:25+05:30

విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) చేసిన విమర్శలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) స్పందించారు. 609 ఎకరాల్లో ఒక సెంటు భూమి అమర్నాథ్ పేరు కాని, తన కుటుంబ సభ్యుల పేరిట భూమి ఉన్నా... రాజకీయాలు నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాము తప్పు చేయాల్సి వస్తే రోడ్డుమీద ఉరి వేసుకుంటాం.. లేకపోతే పీక తీసి పక్కన పెట్టుకుంటామంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిరూపించకపోతే లోకేష్‌ను రాజకీయాలు నుండి తప్పిస్తావా అంటూ సవాల్ విసిరారు. ‘‘మీరు చెప్పిన మాటలు ప్రజలు నమ్మరు. నీ కొడుకులాగా సందులో నుంచి రాజకీయాల్లోకి రాలేదు’’ అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘగర్ ఫ్యాక్టరీలను మూయించింది ఎవరని ప్రశ్నించారు. ఘగర్ ఫ్యాక్టరీలు గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి తెలిపారు.

చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలపై కోపం ఉందన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మంచి జరగకూడదని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దేబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. విశాఖపట్నంపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే.. చంద్రబాబు భోగాలు అనుభవిస్తారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 90 శాతం విజయం సాధించిందన్నారు. ఎన్టీరామారావు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని... చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం చేశారని అన్నారు. ఎన్టీరామారావు శతజయంతి ఉత్సవాలు పేరుతో మరో కొత్తడ్రామాకు తెరతీశారని అన్నారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-20T12:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising